Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ధవళేశ్వరం దుర్ఘటన దురదృష్టకరం... ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నిన్న రాత్రి చోటుచేసుకున్న ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిన్న రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 21 మంది అక్కడికక్కడే మృత్యువాతపడగా, చికిత్స పొందుతూ మరో బాలిక చనిపోయింది. పదమూడేళ్ల బాలుడు కిరణ్ ఒక్కడే బతికాడు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ప్రధాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘ధవళేశ్వరం దుర్ఘటన దురదృష్టకరం, బాధాకరం’’ అంటూ ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు మోదీ సంతాపాన్ని ప్రకటించారు.

More Telugu News